మహిళా వ్యాపారవేత్తను మీటింగ్‌కు పిలిచి... నగ్నంగా నిలబెట్టి... బెదిరింపులు

మహిళా వ్యాపారవేత్తను మీటింగ్‌కు పిలిచి... నగ్నంగా నిలబెట్టి... బెదిరింపులు
X

ముంబయి: మహిళా వ్యాపారవేత్తను మీటింగ్‌కు పిలిచి ఆమెను వివస్త్రగా చేసి లైంగిక వేధింపులకు ఓ కంపెనీ ఎండి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఫ్రాంకో ఇండియన్ ఫార్మాసూటికల్స్ ఎండి జాయ్ జాన్ పాస్కల్ ఓ మహిళ వ్యాపారవేత్తను మీటింగ్ ఉందని ఆహ్వానించాడు. మీటింగ్‌కు వచ్చిన తరువాత తుపాకీ బెదిరించి దుస్తులు తీయించాడు. ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయటచెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎండి జాన్ జాయ్‌తో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళా వ్యాపారవేత్త ఫొటో, ఫ్రేమ్ గిఫ్ట్ బిజినెస్ చేస్తున్నారని తెలిసింది.

Tags

Next Story