బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదు: భట్టి

X
హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ కాలనీలు నిర్మించిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడారు. మన నిధులు మనకే ఖర్చు కావాలని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని భట్టి తెలియజేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదని విమర్శించారు. సాగుకు ఉచిత విద్యుత్ ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాజీ సిఎం కెసిఆర్ ఏనాడు నిధులు ఇవ్వలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Next Story
-
Home
-
Menu
