ఎసిబికి పట్టుబడిన మున్సిపల్ అధికారులు..

X
నిజామాబాద్: నిత్యం ఎక్కడో ఒకచోట అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వ అధికారులు ఎసిబి వలలో పట్టుబడుతున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోనూ లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారులు ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎసిబి పక్కా ప్రణాళిక ప్రకారం ఇవాళ దాడులు చేసింది. బాధితుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఓ మున్సిపల్ అధికారితో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎసిబి అధికారులు పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
