ప్రాణం తీసిన మటన్ ముక్క

ప్రాణం తీసిన మటన్ ముక్క
X

నాగర్‌కర్నూలు: మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొందలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కొత్త ఇళ్లు నిర్మించుకున్నాడు. మేస్త్రీ కష్టపడి ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడంతో అతడి, పనివాళ్లకు దావత్ ఇచ్చాడు. ఇంటిపక్కన ఉండే లక్ష్మయ్యను కూడా దావత్‌కు పిలిచాడు. లక్ష్మయ్య మద్యం తాగిన అనంతరం మటన్ ముక్క తింటుండగా గొంతుల్లో ఇరుక్కుపోయింది. ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లక్ష్మయ్య కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags

Next Story