'తుంగతుర్తి ఎస్ఐ వేధింపులతోనే మా తల్లి చనిపోయింది'

My mother died due to harassment by Tungaturthi SI
సూర్యాపేట: తుంగతుర్తి ఎస్ఐ వేధించడంతోనే మా అమ్మ చనిపోయిందని మృతురాలి కూతురు ఆరోపణలు చేసింది. పోలీసులు వేధించడంతోనే వెంపటి గ్రామానికి చెందిన సోమ నర్సమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణల వినిపిస్తున్నాయి. దీంతో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నర్సమ్మ ఆత్మహత్యకు ఎస్సై క్రాంతి కుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. ఓ బంగారం చోరీ కేసులో ఎస్సై స్టేషన్ కు పిలిపించి వేధింపులకు దిగారని, తన తల్లి ఏ నేరం చేయలేదని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోవడంలేదన్నారు. దొంగతనం కేసులో వేలి ముద్రలు దొరికాయని తన తల్లిని భయబ్ర్రాంతులకు గురి చేశారన్నారు. చేయని నేరం ఒప్పుకోవాలని ఎస్సై ఇబ్బందులకు గురిచేయడంతో తన తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు. తన తల్లి మృతికి కారణమైన ఎస్ఐతో పాటు గాజుల మహేందర్ పై చర్యలు తీసుకోవాలని కుమార్తె డిమాండ్ చేశారు. తమ వైపు పెద్ద మనుషులను కూడా పోలీసులు భయపెట్టారన్నారు. మా అమ్మ పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకోలేదని ఎస్ఐ అన్నారని, ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రైవేటు ఆస్పత్రి నుంచి దొంగపేపర్లు తీసుకొచ్చారని ఎస్ఐ తమని తిట్టారని మీడియాకు తెలిపింది.
-
Home
-
Menu
