నాచారంలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Nacharam
మేడ్చల్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒడిశాకు చెందిన నారాయణ బెహరా(32), బంధిత బెహరా(27) అనే దంపతులు నాచారంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల కూతురు కూడా ఉంది. ఈ దంపతుల ఇంటి పక్కన బిహార్‌కు చెందిన విద్యాసాగర్(24) అనే యువకుడు నివసిస్తున్నాడు. ఈ దంపతులతో పరిచయం కావడంతో విద్యాసాగర్‌తో బంధిత అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించాలని ప్లాన్ వేసింది. గురువారం రాత్రి నారాయణ, విద్యాసాగర్ ఫుల్‌గా మద్యం సేవించారు. ఇంటికి వచ్చిన నారాయణ, బంధిత మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ప్రియుడితో భర్త తలపై రాడ్డుతో కొట్టింది. అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
