కోతుల గుంపు వెంటపడడంతో బాలుడు పరుగెత్తి ప్రాణాలొదిలాడు

కోతుల గుంపు వెంటపడడంతో బాలుడు పరుగెత్తి ప్రాణాలొదిలాడు
X
సూర్యాపేట: కోతులు వెంటపడడంతో బాలుడు పరుగెత్తి గుండె ఆగిపోవడంతో అతడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..... వల్లాపురం గ్రామానికి చెందిన నిశాంత్(12) అనే బాలుడు తన స్నేహితుడు మణిందర్ తో కలిసి చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్లారు. మార్గం మధ్యలో ఒక్కసారిగా కోతుల గుంపు వారిపై రావడంతో భయంతో ఇద్దరు పరుగులు తీశారు. నిశాంత్ ప్రాణభయంతో కిందపడిపోయాడు. వెంటనే మణిందర్ కేకలు వేయడంతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా నిశాంత్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags

Next Story