మార్చి 5న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్

మార్చి 5న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్
X

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. గ్లింప్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ఇవ్వడానికి మార్చి 5న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ అద్భుతంగా వుంది. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మాసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్‌బస్టర్ డెబ్యూ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, వృషకర్మను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Tags

Next Story