మంత్రి కొండా సురేఖ క్షమాపణ.. నాగార్జున కీలక నిర్ణయం

మంత్రి కొండా సురేఖ క్షమాపణ.. నాగార్జున  కీలక నిర్ణయం
X

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై పెట్టిన కేసు విషయంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రిపై పెట్టిన పరువు నష్టం దావా కేసును గురువారం నాగార్జున ఉపసంహరించుకున్నారు. గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖ బుధవారం ట్వీట్‌ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. నాగార్జున బాధపడి ఉంటే.. అందుకు చింతిస్తునన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున.. మంత్రి సురేఖపై కేసును విత్ డ్రా చేసుకున్నారు.

Tags

Next Story