నాగర్‌కర్నూల్ జిల్లా మున్సిపాలీలలో కొలువుదీరిన పాలకవర్గాలు

Nagarkurnool
X

మూడు మున్సిపాలిటీలలో ఏకగ్రీవంగా ఎన్నిక

నాగర్‌కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేశారు. ఒక నాగర్‌కర్నూల్ జిల్లా‌లోని మూడు మునిసిపాలిటీలలో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ గా తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ గా బాదం రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ షానవాజ్ ఖాన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ వరకు సజావుగా సాగడం ప్రజలు మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ఎక్కడ కూడా హంగ్ అవకాశాలు లేకపోవడం తో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు.

Tags

Next Story