నాగోల్‌లో నడిరోడ్డులో వెంటాడి వేటాడి నరికి చంపారు

హైదరాబాద్: నడిరోడ్డులో వెంటాడి వెంటపడి ఓ వ్యక్తిని కత్తులతో నరికిచంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా నాగోల్ ప్రాంతంలోని బండ్లగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా ఉండేవారు. బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్ లో మహమ్మద్ నహీమ్ నివాసముంటున్నారు. ఇద్దరు మధ్య డబ్బుల విషయంలో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. నయీమ్ పై కళ్లలో ఉమామహేశ్వర్ కారం చల్లారు. రోడ్డుపై పరుగులు తీస్తూ వైన్ షాపులో వెళ్లిపోయాడు. ప్రత్యర్థులు వెంటపడి వెంటాడి కత్తులతో నరికి చంపారు. అనంతరం దుండగులు కారులో పారిపోయారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలే హత్యకు కారణంగా తెలుస్తోంది.
Tags
-
Home
-
Menu
