ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లు వీరే

Nalgonda municipal chairmen
నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్నారు. పెరిక స్వాతి, అల్లి సుభాష్ బుర్రి అనే కార్పొరేటర్లు చైతన్య పేరును బలపర్చారు. బరిలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల ప్రత్యేక అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ చైతన్యను ఏకగ్రీవంగా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి చెందిన అష్రఫ్ అలీకి ఇచ్చారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు, చండూర్ మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ, చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత, హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్ గా మానస స్వర్ణలు ప్రమాణస్వాకారం చేశారు.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత, కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జున, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చిన వెంకట్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకెనపల్లి రఘునందన్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి, మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ గా గడ్డం స్వప్న, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా మొగుదల పావని రమేష్ గౌడ్, పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేశంలు ప్రమాణ స్వీకారం చేశారు.
-
Home
-
Menu
