నల్లగొండ విద్యార్థులు విహారయాత్రకు... ఎపిలో ప్రమాదం... 26 మందికి గాయాలు

నల్లగొండ విద్యార్థులు విహారయాత్రకు... ఎపిలో ప్రమాదం... 26 మందికి గాయాలు
X

అమరావతి: విహారయాత్రకు తీసుకెళ్లిన స్కూల్ పిల్లల బస్సులు ఢీకొట్టిన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది పిల్లలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 90 మంది విద్యార్థులు, టీచర్లు విహారయాత్రకు వెళ్లారు. రెండు బస్సుల్లో ఆరుకు, పాడేరు ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటించారు. అర్థరాత్రి రాజమండ్రికి వెళ్తుండగా దివాన్ చెరువు వద్ద ఒక్కసారిగా గేదె రోడ్డుపైకి రావడంతో బస్సుకు బ్రేక్ వేయడంతో విద్యార్థులు గాయపడ్డారు. వెనుక రెండు మరో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు.

Tags

Next Story