గాఢంగా ప్రేమించిన ప్రియురాలు మోసం చేయడంతో యువకుడు ఆత్మహత్య

వరంగల్: గాఢంగా ప్రేమించి యువతి మోసం చేయడంతో ఓ యువకుడు పురుగుల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కొత్తపల్లిగ్రామంలో ఇమ్మడి శ్రీకాంత్(26) అనే యువకుడు నివసిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన యువతి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించింది. అవసరాల కోసం యువకుడి వద్ద నుంచి పలుమార్లు యువతి కుటుంబ సభ్యుల డబ్బులు తీసుకున్నారు. తన కూతురు ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో శ్రీకాంత్‌ను హెచ్చరించారు. తన కూతురు జోలికి వస్తే కేసు పెడుతామని హెచ్చరించడంతో అతడు తీవ్ర మానసికవేదనకు గురయ్యాడు. ప్రియురాలు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తనని మోసం చేసిందని తెలుసుకున్న యువకుడు ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు.
Tags
-
Home
-
Menu
