మీ ప్రేమతో పాటు.. ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నా: నాని

The Paradise
X

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. గురువారం (సెప్టెంబర్ 24న) విడుదలైన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా బాగుందని చెబుతుంటే.. కొంతమంది తమకు నచ్చలేదని అంటున్నారు. అయితే సినిమాపై వచ్చిన రివ్యూలపై నాని స్పందించారు. సినిమాపై చూపిస్తున్న ప్రేమ, విమర్శలు రెండింటినీ స్వాగతిస్తున్నానని అన్నారు.

‘‘ది ప్యారడైజ్‌పై అభిప్రాయాలు, స్పందన అన్నింటినీ చూశా. మీరు చూపించిన ప్రేమతో పాటు, సరదా ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నా. దీనిని తమ సినిమాగా ప్రేక్షకులు స్వీకరించిన తీరు నా హృదయానికి హత్తుకుంది. అదే సమయంలో సినీ విమర్శకులు, రివ్యూవర్లు ఎత్తి చూపిన పొరపాట్లు, లోటుపాట్లను పరిగణనలోకి తీసుకుంటాను. మీ అందరికీ కృతజ్ఞతలు. మీకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి #TheParadise తీర్చిదిద్దాం. మీరు దీన్ని సంబరంగా చేసుకోవచ్చు. విమర్శించవచ్చు. సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతకు నాలో కృతజ్ఞత భావాన్ని నింపాయి’’ అని నాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ప్యారడైజ్ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. నాని కెరీర్‌లోనే ఇవి రికార్డుస్థాయి కలెక్షన్స్ అని వెల్లడించింది.

Tags

Next Story