ఘనంగా నారా రోహిత్ పెళ్లి... హాజరైన ఎపి సిఎం చంద్రబాబు దంపతులు
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ వివాహం ఘనంగా జరిగింది. నటి శిరీషను రోహిత్ గురువారం రాత్రి పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 'ప్రతినిధి2' మూవీలో రోహిత్‌కు జంటగా శిరీష్ నటించారు. ఇద్దరు మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఎపికి చెందిన శిరీష్ అస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివారు. నటనపై ఆసక్తితో స్వదేశానికి తిరిగొచ్చి సినిమాల్లో ప్రయత్నించారు. హైదరాబాద్‌లో తన అక్క దగ్గర ఉంటూ సినీ రంగంలోకి శిరీష ప్రవేశించారు. ప్రతినిధి2 సినిమాలో నటించి ఇప్పుడు నారా వారి కుటుంబంలోకి వచ్చారు.
Next Story
-
Home
-
Menu


