కాలువలో పడిన బైక్... భార్య మృతి, కుమారుడు గల్లంతు... భర్తే హత్య చేశాడా?

అమరావతి: దంపతులు బైక్‌పై వెళ్తుండగా బొలెరో వాహనం అడ్డురావడంతో భార్య, కుమారుడు కాలువలో పడిపోయారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామంలో శ్రీకాంత్(30), త్రివేణి(25) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడిని ఆస్పత్రికి బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఓ కాలువ వద్ద బొలెరో వాహనం అడ్డురావడంతో ద్విచక్రవాహనం కాలువలో పడిపోయింది. శరత్, త్రివేణి, బాలుడు కాలువలో పడ్డారు. భార్య, కుమారుడు గల్లంతు కావడంతో వెంటనే శరత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. భార్య మృతదేహం కనిపించగా బాలుడి ఆచూకీ కనిపించలేదు. భార్య, కుమారుడిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య శరీరంపై గాయాలు ఉన్నాయని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు.
-
Home
-
Menu
