పొంగులేటి స్వగ్రామం ఏకగ్రీవం

రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది.ఈనెల 9న ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్‌సి జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ ఏకగ్రీవానికి మంత్రి పొంగులేటి సోదరుడు, పార్టీ రాష్ట్ర నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని కల్పించారు. దీంతో పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడే దిశగా మార్గం సుగమమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లుకు మంత్రి శ్రీనివాసరెడ్డి, అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు.
-
Home
-
Menu
