నారాయణ పేట జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన డిజె సౌండ్స్

నారాయణ పేట జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన డిజె సౌండ్స్
X

నారాయణ పేట: స్నేహితుడి పెళ్లి వేడుకలో డిజె సౌండ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుండగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణ పేట జిల్లా కోస్గి మండల పరిదిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..... పోతిరెడ్డిపల్లి గ్రామంలో దస్తయ్య, లక్ష్మీ అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతులకు రవితేజ(17) అనే కుమారుడు, కూతురు ఉంది. రవితేజ తన స్నేహితుడు పెళ్లి ఉండడంతో అక్కడికి వెళ్లాడు. పెళ్లి వేడుకల డిజె సౌండ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఎక్కువ సౌండ్స్ విన్నప్పుడు గుండె లయ తప్పుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా డిజె సౌండ్స్ బ్యాన్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

Tags

Next Story