ఈసారి సంక్రాంతికి టఫ్ ఫైట్.. బరిలో మరో యంగ్ హీరో

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్‌బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు.
ఇక మేకర్స్ 'నారి నారి నడుమ మురారి' సినిమా ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుందని ప్రకటించారు. ప్రీమియర్ షో సమయం - సాయంత్రం 5:49 అని మేకర్స్ తెలియజేశారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. కానీ మొదటిసారిగా ఈ సినిమా సాయంత్రం రిలీజ్ ని ఎంచుకుంటోంది. ముహూర్తం ఇంత త్వరగా ఖరారు కావడం టీమ్ ఖచ్చితమైన ప్లానింగ్‌ని తెలియజేస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వా స్టైలిష్‌గా కనిపిస్తూ, మెడలో పూల హారంతో నిల్చున్నారు. సంయుక్త ఆవేదనతో నిండిన లుక్‌లో కనిపిస్తే, సాక్షి వైద్య స్వచ్ఛమైన చిరునవ్వుతో ఫ్రేమ్‌కి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది.
-
Home
-
Menu
