విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక దాడి... వీడియో తీసి మరో లెక్చరర్ కు పంపించి... బ్లాక్ మెయిల్

national sanskrit university in tirupati
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై లెక్చరర్ లక్ష్మణ్‌కుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు రికార్డు చేసి మరో లెక్చరర్ శేఖర్ కు పంపించాడు. ఆ వీడియోతో విద్యార్థినిని లెక్చరర్ శేఖర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ప్రొఫెసర్ల కీచకపర్వం భరించలేక సదరు విద్యార్థిని వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. పోలీసులకు విసి, రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. లెక్చరర్లు లక్ష్మణ్‌కుమార్, శేఖర్ సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సదరు విద్యార్థిని యూనివర్సిటీ నుంచి సొంతూరుకు వెళ్లిపోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్లు దారి తప్పి కామకీచకులు మారడం సమాజానికి మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో ఇంత జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
-
Home
-
Menu
