నవనాయకుల ఫలితాలు.... భవిష్య భారతం 2026-27

నవనాయకుల ఫలితాలు.... భవిష్య భారతం 2026-27
X

రాజు - గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశంసుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎప్పుడూ లేని విధంగా అధికంగా ధరలు పెరుగుతాయి, సామాన్యుడికి బంగారం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్నప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశు, పక్షి సంతతిని రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, పప్పు దినుసులు అధికధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫానులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్‌ను బట్టి కాకుండా బ్యాక్‌గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పదం అవుతాయి. బంగారు ఆభరణాలలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది. సాంప్రదాయ బద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. ధర్మ సత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది, హైందవ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది.

మంత్రి - కుజుడు: మంత్రిత్వం కుజునికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్నిప్రమాదాలు జరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. రాజకీయాలలో కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధరలు కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమారంగం, రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా రాణిస్తారు. యువత పెడదోవ పడతారు, వాయుకాలుష్యం పెరుగుతుంది.

సేనాధిపతి - చంద్రుడు: సేనాధిపత్యం చంద్రుడుకి రావడం వలన భూముల ధర పెరుగుతుంది. అన్ని వస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్ధతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాలలోని వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

సస్యాధిపతి - శుక్రుడు: సస్యాధిపత్యం శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరులై పారుతుంది. ప్రతి విషయంలో స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థినీ విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది చెలరేగిపోతారు. క్రీడారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. సినీ, కళారంగాలలోని వారికి, సాహిత్య రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది.

ధాన్యాధిపతి - బుధుడు: ధాన్యాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. దుంప కూర లు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్ట్స్ లకు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారికి, బోధనారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

అర్గ్యాధిపతి - చంద్రుడు: అర్గ్యాధిపతి చంద్రుడికి రావడం వలన పంటలు బాగా పండును, పాల ఉత్పతులకు సంబందించిన అన్ని రకాల వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు వుంది, కొన్ని చోట్ల వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధర కలిగి ఉంటాయి, పూజా సామాగ్రి అధిక ధరలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ రంగాలలో వున్న స్త్రీలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

మేఘాధిపతి - చంద్రుడు: మేఘాధిపతి చంద్రుడుకి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గో సంపద పెరుగుతుంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం వుంది.

రసాధిపతి-రవి: రసాధిపతి - రవికి రావడం వలన గోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధించిన వస్తువులు అధిక ధర ఉంటుంది. తేనె, కందులు అధిక ధరలు కలిగి ఉంటాయి, రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు గడ్డుకాలం (కొంతమందికి మాత్రమే).

చంద్రుడు

మన:కారకో చంద్ర అన్నారు. అంటే మన మనసు అనేది చంద్రుని ఆధీనంలో ఉంటుంది అని. మన మనోబలానికి చంద్రుడే కారకుడు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. సూర్య మండలంలోని గ్రహాలలో చంద్రుడొక్కడే భూమి చుట్టూ తిరిగే గ్రహం. మన దైనందిన కార్యక్రమాలు చంద్రుని మీద ఆధారపడి ఉంటాయి. చంద్రుడు అనుకూలమైన రాశిలో ఉన్నప్పుడు ఉత్సాహంగా, ప్రతికూలమైన రాశిలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా, కృంగిపోయినట్లు ఉంటాము. రవిచంద్రులను రాజగ్రహాలని అంటారు. రవి పురుష గ్రహం, చంద్రుడు స్త్రీ గ్రహం. చంద్రుడు కర్కాటకరాశికి అధిపతి. వృషభరాశి చంద్రునికి ఉచ్ఛ స్థానము, వృశ్చికరాశి నీచస్థానము.

కర్కాటకరాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన వారికి చంద్రుడు బలంగా ఉన్నాడని, వృషభ రాశి అన గా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాల యందు జన్మించిన వారికి చం ద్రుడు అధికబలం కలిగి ఉన్నాడని అర్థం, అదే విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కలిగి వృశ్చికరాశి వారికి చంద్రబలం తక్కువ.

జాతకంలో లగ్నం నుండి గ్రహాలు ఉన్న స్థితిననుసరించి ఫలితాలు చెప్పినట్టే చంద్రరాశిని, చంద్రలగ్నంగాపేర్కొంటూ అక్కడి నుండి గ్రహాల స్థితిని గమనించాలి. ముఖ్యంగా గోచార ఫలితాలు చంద్రరాశి నుండే చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది. చంద్రునికున్న ప్రాముఖ్యత జన్మనక్షత్రానికి కూడా ఉంటుంది. చంద్రుని నక్షత్రాలు అయినటు వంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి జనన సమయంలో చంద్రదశ జరుగుతున్నట్టే. ముహూర్తాలకు తారాబలం, చంద్రబలాలను చూడవలసి ఉంటుంది. దైనందిన జీవితంలో కూడా దానిని చూసి ఏ రోజు అనుకూలమైనదో, ఏ రోజు మనకు అనుకూలం కాదో తెలుసుకోవచ్చు. చంద్రుడు మానసిక వికాశానికి, మనోధైర్యానికి కారకత్వం వహిస్తాడు. ఏ సమస్య వచ్చినా దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్ర గ్రహం పాత్ర చాలాముఖ్యమైనది.

ఎవరికైతే చంద్రబలం బాగుంటుందో వారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబలం బాగాలేకపోతే వారు తీసుకునే నిర్ణయాల వలన చాలా సందర్భాలలో సమస్యలను ఎదుర్కొంటారు. చంద్రుని గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిశ్యశాస్త్ర రీత్యా పూర్ణ చంద్రుడిని శుభుడిగా, క్షీణ చంద్రుడిని పాపిగా చెప్పారు. పూర్ణ చంద్రుడు అనగా శుక్ల పంచమి నుండి బహుళ పంచమి వరకు ఉండే చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. చంద్రునికి మిత్రులు రవి, బుధులు. శత్రువులు ఎవ్వ రూ లేరు. కుజ, గురు, శుక్ర, శనులు సములుగానే పేర్కొనబడ్డారు. బుధ, శుక్ర, శనులకు చంద్రుడు శత్రు గ్రహం. అందువలన మిథున. కన్య(బుధ రాశులు), వృషభ, తుల (శుక్ర రాశులు), మకర, కుంభ (శని రాశులు), రాశులయందు చంద్రుడు ఉంటే ఆయా రాశులలో శత్రువు ఉన్నట్టే లెక్క. ఆ శత్రుత్వాన్ని శాంతి చేయడానికి చంద్రునికి పరిహారాలు, దానాలు చేయవలసి ఉంటుంది.

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని ‘చంద్ర గ్ర హణం’ అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలా సే పు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది. చంద్రుడు మాతృకారకుడు. తల్లికి ఆరోగ్యం బాగుండకపోయినా, తనకు మానసికంగా వేదన ఉన్నా, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థికంగా బాధపడు తున్నా చంద్రునికి శాంతి క్రతువులు చేయడం మంచిది.

Tags

Next Story