ఒటిటిలోకి నయనతార కొత్త చిత్రం.. ఎక్కడ చూడొచ్చంటే..

Nayanthara
X

స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఆమె ‘హాయ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కవిన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఒటిటిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జి5 వేదికగా సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొన్ని రోజులుగా ఈ చిత్రం ఒటిటి తేదీపై వార్తలు వచ్చినప్పటికీ తాజాగా జి5 అధికారికంగా ప్రకటించింది. విష్ణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, సుహాసిని కీలక పాత్రల్లో నటించారు.

Tags

Next Story