నేరేడ్ మెట్‌లో ఆర్మీ ట్రక్ ఢీ.. బాలుడు మృతి

నేరేడ్ మెట్‌లో ఆర్మీ ట్రక్ ఢీ.. బాలుడు మృతి
X

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ కె పురం ఫ్లైఓవర్ వద్ద బుధవారం ఉదయం ఆర్మీ ట్రక్కు ఢీకొనడంతో బాలుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆరు సంవత్సరాల బాలుడు ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఒకటవ తరగతి చదువుతున్నాడు మృతి చెందాడు. తల్లి–కుమారుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆర్మీ ట్రక్ ఢీకొట్టింది. బాలుడు ఘటనా స్థలంలో చనిపోగా తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే నేరేడ్మెట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags

Next Story