విమాన టికెట్ రద్దుపై కొత్త రూల్స్

విమాన టికెట్ రద్దుపై కొత్త రూల్స్
X

డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) టికెట్ రద్దు, మార్పులపై కొత్త నిబంధనలు జారీ చేసింది. బుకింగ్ చేసిన 48 గంటలలోపు రద్దు చేస్తే అదనపు రుసుము ఉండదు. అయితే ప్రయాణ తేదీకి కనీసం 7 రోజుల ముందు టికెట్ బుక్ చేసి ఉండాలి. 14 పని దినాల్లోపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తి వాపసు లేదా క్రెడిట్ సదుపాయం కల్పించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటామని డిజిసిఎ స్పష్టం చేసింది.

Tags

Next Story