యోధుడుగా నిఖిల్.. అదిరిపోయేలా ‘స్వయంభు’ టీజర్

Swayambhu
X

కార్తికేయ-2 సినిమా తర్వాత యువ హీరో నిఖిల్‌కు సరైన హిట్ పడలేదు. ఆ సినిమా తర్వాత మూడు సినిమాలు చేసినప్పటికీ.. అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే ఇప్పుడు ఓ పీరియాడిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నిఖిల్. ఆ సినిమానే ‘స్వయంభు’. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. గ్రాండ్ సెట్స్‌తో.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిఖిల్ యోధుడి పాత్రలో దుమ్ములేపేశాడు. ఇక ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిగా.. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఈ వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.



Tags

Next Story