భైంసాలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

భైంసాలో ప్రియురాలిని చంపిన ప్రియుడు
X

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటు చేసుకుంది. సంతోషిమాత ఆలయం సమీపంలోని ఓ టీ పాయింట్ వద్ద ఓ మహిళ(27) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంసర గ్రామానికి చెందిన మహిళకు ఇదివరకే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, భర్తతో విడాకులు తీసుకొని కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన నగేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఉపాధికోసం ఆ మహిళ టీ పాయింట్ నడుపుతోంది.

సోమవారం ఉదయం టీ పాయింట్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. నగేశ్ చేతితో మహిళ హత్యకు గురై.. రక్తపు మడుగులో కనిపించింది. నిందితుడు కూడా పక్కనే కూర్చోని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడు నగేశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ధీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story