రూ.10,000 కోట్లతో కంటైనర్ పథకం

వచ్చే ఐదేళ్లలో కంటైనర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక పథకాన్ని ఆర్థికమంత్రి నిర్మల ప్రతిపాదించారు. పర్యావరణ పరంగా స్థిరమైన కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు, అధికంగా విలువైన, ఆధునిక సాంకేతిక విలువలతో కలిగిన కంటైనర్ లను దేశీయంగా తయారీకి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఆదివారం బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా చెప్పారు.రానున్న ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం 20 కొత్త జలమార్గాలను (ఎన్ డబ్ల్యూ) అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తల్చేర్ , అంగుళ్ ఖనిజ సంపన్న ప్రాంతాలను, కళింగ నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పరదీప్,
ధమ్రా ఓటరేవులకు అను సంధానించడానికి ఒడిశా లోని ఎన్ డబ్ల్యూ -5 నుంచి జలమార్గాల ఏర్పాటు మొదలవుతుంది.వారణాశి, పట్నా లో లోతట్టు జలమార్గాల కోసం ఓడల మరమ్మతు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు .2047 కల్లా లోతట్టు జలమార్గాలు, తీర ప్రాంత షిప్పింగ్ వ్యవస్థ వాటాను 6 నుంచి 12 శాతానికి పెంచేందుకు, కోస్టల్ కార్గో ప్రమోషన్ పథకం ప్రారంభించాలని మంత్రి ప్రతిపాదించారు.జలమార్గాలను సమర్థంగా నిర్వహించేందుకు నావికుల శిక్షణ సంస్థలను, ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జలమార్గాల అంతటా యువత శిక్షణ పొందేందుకు, నైపుణ్యాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.
-
Home
-
Menu
