నివేదా 'శ్రీమతి' ట్రైలర్ విడుదల..

నివేదా శ్రీమతి ట్రైలర్ విడుదల..
X

'నిన్నుకోరి' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి కుర్రకారు హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ నివేదా థామస్.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా అవి సక్సెస్ కాకపోవడంతో కెరీర్ లో వెనుకపడిపోయింది. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత '35 చిన్న కథ కాదు' మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో నివేదా నటనకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి.

ఈ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ తాజాగా కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. నివేదా ప్రధానపాత్రలో 'శ్రీమతి' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో మరోసారి హౌస్ వైఫ్ గా నివేదా నటిస్తోంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆమె భర్తగా తిరువీర్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.


Tags

Next Story