భర్త వేధింపులు భరించలేక.. హత్య చేసిన ఇద్దరు భార్యలు

భర్త వేధింపులు భరించలేక.. హత్య చేసిన ఇద్దరు భార్యలు
X

నిజామాబాద్: మద్యం సేవించి తరచూ వేధిస్తున్న భర్తను అతడి భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలం దేవక్కపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవక్కపేటకు చెందిన మలవత్ మోహన్(42)కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మోహన్ తరుచూ మద్యం తాగుతూ వచ్చి భార్యలతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి వారిద్దరినీ గదిలో బంధించాడు. దీంతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు మోహన్‌‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం పెట్రోల్ కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో నిద్రపోతున్న మోహన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story