గొట్లపల్లిలో నామినేషన్ పత్రాల చోరి?

పెద్దేముల్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్స్ వేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దేముల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురైనట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతాండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు. అయితే, బుధవారం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ ఉమశంకర్ ప్రసాద్, DSP యాదయ్యలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
-
Home
-
Menu
