చెక్ బౌన్స్ కేసులో.. పైలెట్ రోహిత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్

X
చెక్ బౌన్స్ కేసులో తాండూరు మాజీ ఎంఎల్ఎ పైలెట్ రోహిత్‌రెడ్డిపై మెట్రోపాలిటన్ కోర్టు శనివారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.వివరాలు ఇలా...మెసర్స్ ఇంటెల్లిడెక్స్ అనే కంపెనీకి మాజీ ఎంఎల్ఎ పైలెట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. ’మెసర్స్ ఇంటెల్లిడెక్స్’ కంపెనీకి అతడు ఇచ్చిన చెక్కులు మూడు సార్లు బౌన్స్ అయ్యాయి. దీంతో సంస్థ ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఆధారాలు, వాదనలు పరిశీలించిన అనంతరం నెగోషియబుల్ ఇస్ట్రుమెంట్స్ యాక్టులోని సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా తేల్చింది.తీర్పు వెలువడే సమయంలో నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు. న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
Next Story
-
Home
-
Menu
