పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలోనూ ముందున్నాం: నూతనకల్ మహిళా సంఘాలు

పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలోనూ ముందున్నాం: నూతనకల్ మహిళా సంఘాలు
X

సూర్యాపేట: మేము పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలో లోనూ ముందున్నామని నూతనకల్ మండల కేంద్రంలో ఉన్న మహిళా సంఘాలు నిరూపిస్తున్నాయి. 40 సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ఒక సంఘ బంధంగా ఏర్పడి సమూహంగా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ, సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. మేము ఆర్థికంగా స్థిరపడమే కాదు మా తోటి మహిళల, వృద్ధుల అభాగ్యుల బాధ్యత మాకు ముఖ్యమే అంటున్నా నూతనకల్ సంఘ బంధం మహిళా సమూహంపై అందిస్తున్న ప్రత్యేక కథనం..

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో 40 సంఘాలలో అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మహిళా సంఘాల అధ్యక్షులు అంతా కలిసి సంఘ బంధంగా ఏర్పడి ఒక సమూహంగా సామాజిక బాధ్యతతో వృద్ధులు, ఆదరణ లేని వారికి నిస్సహాయులైన చిన్నారులకి చేయూతనిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థిని విద్యార్థులకు విద్యకు సంబంధించిన మెటీరియల్స్ తో పాటు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ బాల్య వివాహం జరిగిన వెంటనే వీరి సమూహం అక్కడికి చేరుకొని వివాహాన్ని జరగకుండా నివారించడంతో పాటు తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక గ్రామంలోని వృద్ధులు నిరాశ్రయులకి ఏ ఇబ్బంది అయినా మేమున్నామంటూ నిత్యవసరాలతో పాటు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. సంఘ బంధ సభ్యులు భాగ్యలక్ష్మి, దూరదర్శన్ తో మాట్లాడుతూ.... పొదుపు చేయడమే కాదు మాకు ఉన్నంతలో మేము కొంత సేవకు వినియోగించడం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు. మరో సభ్యురాలు మౌనిక మాట్లాడుతూ ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని, మహిళా సంఘంలో పొదుపు చేస్తూ తాము ఆర్థికంగా స్థిరపడడడంతో ఎంతో ది ఇబ్బందుల నుంచి బయటపడ్డామని వివరించారు. ఈ రకంగా మేము సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వృద్ధాప్యంలో ఉండి ఎవరు లేకపోవడంతో నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులకి, నిత్యవసర సరుకులు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు విద్యార్థుల విషయంలో కూడా ఉదాసీనత గా వ్యవహరిస్తూ సామాజిక సేవలో సంఘం సభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు.

Tags

Next Story