రొట్టెల పెంకతో బాదిన భర్త... భార్య మృతి

X
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దారుణం జరిగింది. నయాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డెబ్ రే కాలేజీ సమీపంలోని బ్రిట్ కాలనీ ప్రాంతంలో భార్యను భర్త హత్య చేశాడు. బ్రిట్ కాలనీలో సర్వేశ్వర్, ప్రధాన్, బనిశ్మిత స్వైన్గా అనే దంపతులు నివసిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఈ దంపతులు పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల దంపతులు గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రొట్టెల పెంకతో (తావా) భార్య తలపై భర్త బాదడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
