అధికారి భార్య అందంగా ఉంది... అందుకే పదవి ఇచ్చాను: ట్రంప్

officer's wife is beautiful says by trump
న్యూయార్క్: అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించిన సందర్భంగా ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. డగ్ భార్య అందంగా ఉండడంతోనే ఆయనకు పదవి వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలు చేస్తుండగా డగ్, ఆయన భార్య అక్కడే ఉంది. నార్త్ డకోటాకు డగ్ రెండు సార్లు గవర్నర్‌గా సేవలందించారని, బర్గ్ విజయం వెనుక ఆయన సతీమణి కీలక పాత్ర పోషించి ఉంటారని ప్రశంసించారు. డగ్, ఆయన భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ వీడియో చూశానని, ఆమె చాలా అందంగా కనిపించిందని, ఎవరని తన సిబ్బందిని అడిగానని, ఈ జంట గురించి వినగానే తనకో అభిప్రాయం ఏర్పడిందన్నారు. అందుకే డగ్‌కు పదవి ఇచ్చానని, అతడు విజయవంతమైన బిజినెస్‌మ్యాన్ అని కొనియాడారు. ఆమె అందంగా ఉందని ట్రంప్ అనడంపై విమర్శలు వస్తున్నాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడారని, గతంలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
-
Home
-
Menu
