మణుగూరులో పశువుల దాడిలో వృద్ధురాలు మృతి

మణుగూరులో పశువుల దాడిలో వృద్ధురాలు మృతి
X

మన తెలంగాణ/మణుగూరు: పశువుల దాడిలో వృద్దురాలు మృతి చెందిన సంఘటన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిదిలోని పివి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు పట్టణానికి చేందిన చింతల ఎల్లమ్మ (80) మణుగూరు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. వృద్ధురాలు తన ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో మణుగూరు బస్టాండ్‌కు చేరుకుంటున్న సమయంలో ప్రక్కనే ఉన్న పశువులు దాడి చేయగా తీవ్రంగా గాయపడిందని తెలిపారు. స్ధానికులు గమనించి వెంటను ఆమెన స్థానిక ఆస్పత్రికి తరలించగా వృద్దురాలు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై మృతురాలి కోడుకు శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ నాగబాబు తెలిపారు.

Tags

Next Story