తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ విడుదల

తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ విడుదల
X

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం సినిమా 'జయ జయ జయహే'కు ఇది రిమేక్. 2022లో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో అందుబాటులో ఉంది. తెలుగులోనూ డబ్ చేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి రూపొందించారు. ఏఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.




Tags

Next Story