సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో నానమ్మ కన్నుమూత

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక  గుండెపోటుతో నానమ్మ  కన్నుమూత
X

జనగామ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందగా, ఆ విషాదాన్ని తట్టుకోలేక ఆమె నానమ్మ గుండెపోటుతో మృతి చెందారు. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. రియాన్సీ అనే ఏడాదిన్నర చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించినప్పటికీ,

అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.చిన్నారి మృతితో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె నానమ్మ నాగమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను కూడా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో వరుసగా రెండు మరణాలు సంభవించడంతో అంబేద్కర్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story