హయత్‌నగర్‌లో ఘరానా ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం

హయత్‌నగర్‌లో ఘరానా ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం
X

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఘరానా ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. క్యువిఎస్ఇ యాప్ పేరుతో భారీగా పెట్టుబడుల సేకరించారు. పెట్టుబడులు పెడితే నెలకు లక్షల్లో లాభాలు వస్తాయని వెంకటేశ్వర అప్ప అనే వ్యక్తి ఆశచూపాడు. ఒకే కాలనీకి చెందిన సుమారు 800 మంది బాధితులు క్యువిఎస్ఇ యాప్ లో పెట్టుబడ్డులు పెట్టారు. రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు మోసం జరిగినట్లు బాధితుల ఆరోపణలు చేస్తున్నారు. క్యువిఎస్ఇ యాప్ క్లోజ్ కావడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. పెట్టుబడులు, లాభాలు అందకపోవడంతో బాధితులు భారీ సంఖ్యలో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వెంకటేశ్వర అప్పపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం మరవకముందే హయత్‌నగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story