మేడారంకు బయల్దేరిన పగిడిద్దరాజు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. వన దేవతల జాతర ప్రారంభానికి సంకేతంగా సమ్మక్క భర్త పగిడిద్ద రాజు మేడారం గద్దెనెక్కేందుకు ముస్తాయ్యారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ గ్రామంలో పగిడిద్దరాజును వరుడిగా అలంకరించేందుకు పెనక వంశీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నేడు పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయనున్నారు. పూనుగొండ్లనుంచి బయలుదేరిన పగిడిద్దరాజు సుమారు 70నుంచి 80 కిలోమీటర్ల అటవీమార్గంలో కాలినడకన బయలుదేరి మేడారం చేరుకోనున్నారు. పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువు దీరిన వెంటనే మహా జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో వారంముందు నుంచే గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పగిడిద్దరాజు ఆలయానికి రంగువేసి గద్దెను సుందరంగా అలంకరించారు. ఇళ్ల ముందు ముగ్గులు, తోరణాలతో గ్రామం నిండా భక్తి పరిమళం వెల్లివిరుస్తోంది.
పగిడిద్దరాజు గద్దెనెక్కిన తరువాతే జాతర జోరు
పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువు దీరిన వెంటనే మహా జారతకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఆయన గద్దెనెక్కిన తరువాతే జాతర జోరు పెరుగుతుంది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. ఈవిధంగా వన దేవతల జాతర కీలక మలుపు పగిడిద్దరాజుతోనే ప్రారంభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ధనసరి అనసూయ
మేడారం బయలుదేరనున్న పగిడిద్దరాజు బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరే సమయానికి పగిడిద్దరాజు కొలువుదీరనున్నారు. ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలకు మంత్రి సీతక్క డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగ కల్యాణి, మేడారం ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఇర్ప సుకన్య, స్టేట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచులు, మండల నాయకులు పూజారులు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
