భారత్ తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. రూ.4,500 కోట్ల నష్టం!

భారత్ తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. రూ.4,500 కోట్ల నష్టం!
X

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు పాల్గొంటుందా?..పాల్గొన్న టీమిండియా జట్టుతో మ్యాచ్ ఆడుతుందా? అనే దానిపై కొద్దిరోజులుగా అనిశ్చితి నెలకొంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ తమ జట్టు పాల్గొంటుందని.. కానీ, టీమిండియాతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం లాహోర్‌లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యాడు. చర్చల అనంతరం పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"ట్వంటీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఫిబ్రవరి 15న భారత్ తో జరగాల్సిన మ్యాచ్‌ బహిష్కరించాలని నిర్ణయించింది" అని ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఉంటారు. దీంతో ఈ మ్యాచ్ ద్వారా భారీగా ఆదాయం ఉంటుంది. ఇప్పుడు టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడకోవడం వల్ల దాదాపు రూ.4.500 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నారు. ఇదిలావుంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఇప్పటికే బంగ్లా జట్టు ఈ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికలుగా ఈ టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది.


Tags

Next Story