గాడిదా మజాకా... పాకిస్థాన్ టూ చైనా... ఈ కథ చదవాల్సిందే

గాడిదా మజాకా... పాకిస్థాన్ టూ చైనా... ఈ కథ చదవాల్సిందే
X

కాదేవి కవిత కనర్హం అనేది శ్రీ శ్రీ ఉవాచ. కాదేది అంతర్జాతీయ వాణిజ్యానికి అనర్హం అనేది నేటి సామెత. గాడిద గాడిద అంటే మనం చులకనగా చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా 2 లక్షల గాడిదలను చైనాకు పాకిస్తాన్ ఎగుమతి చేస్తుంది. అదేదో చైనాలో ఓ నేటివ్ మెడిసిన్ తయారు చేసేకి ఈ గాడిద చర్మాన్ని వాడతారట. దాని ద్వారా రక్తహీనత మరియు సంతాన ఉత్పత్తి లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అక్కడి ప్రాంతీయ మెడిసన్ వాడేవారి నమ్మకం. పనిలో పని అక్కడ గాడిద మాంసాన్ని కూడా లొట్టలు వేసుకొని తింటారు అంట. మనదేశంలో కూడా బర్రె పాలు కంటే ఆవుపాలకంటే గాడిద పాలు చాలా రేటు ఎక్కువగా ఉంటుంది.

మనదేశంలో పిల్లలకు గాడిదపాలు పట్టిస్తే వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి అని అంటారు. ఎవరైనా పిల్లలు మందబుద్ధిగా ఉంటే మీ అమ్మ శానీ పాలు పట్టలేదా అని అంటారు, అంటే అది గాడిద పాలు అన్నమాట.

కర్నూలు నగరంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా గాడిదలు కనపడేటివి ఇప్పుడు అసలు కనపడడం లేదు. కర్నూలు అంటే మేము చదువుకున్నప్పుడు డిడిడి అనేవారు డాన్కీస్, డాక్టర్స్, డస్ట్ అని అర్థం. ఏమైనా గాడిదలతో కూడా అంతర్జాతీయ వ్యాపారం చేయవచ్చు, కాబట్టి పని లేకుంటే గాడిదలు కాయిపో అని మనం ఇక అనరాదు. ఎందుకంటే గాడిదలు కాసి ఎక్కువగా పెంచుకుంటే వాటిని మనము ఎగుమతి చేయవచ్చు.


డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Tags

Next Story