శ్రీలంకకు కాలం చెల్లిన వస్తువులను పంపిన పాక్

శ్రీలంకకు కాలం చెల్లిన వస్తువులను పంపిన పాక్
X


శ్రీలంక తుపాను బాధితులకు గడువు ముగిసిన వస్తువులను పాకిస్తాన్ సాయంగా పంపిందన్న వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ పంపిన ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్ లోనే ముగిసినట్టు తెలిసింది. వీటిని గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అసంతృప్తి తెలియజేసినట్టు సమాచారం. 2015లో నేపాల్ భూకంపం సంఘటన సమయంలోనూ కొన్ని ఆహార పదార్థాలను పాకిస్తాన్ పంపించి వివాదానికి కారణమైంది. తాజా పరిణామాలపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

Tags

Next Story