ఆఫ్ఘనిస్తాన్‌లో 10 స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు..

ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని 10 స్థావరాలపై గురువారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. తమ దేశంపై తాలిబన్ దళఆలు డ్రోన్ దాడులు చేసిందని ఆరోపిస్తూ.. అఫ్గాన్ పై పాక్ వైమానిక దాడులు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది డ్రోన్లను ప్రయోగించి, పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై షెల్లింగ్ జరిపినందుకే.. ఈ దాడులను ప్రారంభించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అటౌల్లా తారర్ ప్రకటించారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించగా, దానిని పాకిస్తాన్ సైనికులు భగ్నం చేసి.. ఈ దాడులు జరిపినట్లు పాక్ అధికారులు తెలిపారు.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, పక్తికా ప్రావిన్సులలో వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. మరోసారి తాజాగా పాక్ దాడులు చేపట్టింది. అయితే, ఈ దాడులపై కాబూల్ ఇంకా స్పందించలేదు.
-
Home
-
Menu
