టీమిండియాపై మళ్లీ కామెంట్లు చేసిన పాక్ క్రికెటర్... ట్రోల్ చేస్తున్న ఇండియన్స్

టీమిండియాపై మళ్లీ కామెంట్లు చేసిన పాక్ క్రికెటర్... ట్రోల్ చేస్తున్న ఇండియన్స్
X

హైదరాబాద్: టీమిండియా ఫీల్డింగ్ విభాగంలో సరిగా లేదని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ తెలిపాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్లు మూడు నుంచి నాలుగు క్యాచ్ లు మిస్ చేయడంతో పాటు బంతిని ఆపేటప్పుడు తడబాటుకు గురవుతున్నారని తెలిపారు. హెట్ మేయర్ ఔట్ పై కూడా సందేహాలు ఉన్నాయని, తాను మాత్రం ఔట్ అనుకోవడం లేదని, హెట్ మేయర్ రెండు మూడు ఓవర్లు ఆడి ఉంటే 230 పరుగులు వెస్టిండీస్ జట్టు చేసేదని అమీర్ వివరణ ఇచ్చాడు. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎక్కువగా పరుగులు తీశారని, సెమీ పైనల్స్ జట్లు స్పిన్ బాగా ఆడుతాయని చెప్పారు.

మైదానంలో భారత జట్టు సరిగా ఆడటం లేదనని, స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తప్పితే మిగిలిన బౌలర్లు అందరూ దారుళంగా పరుగులు ఇస్తున్నారన్నారు. ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులు ఇచ్చాడని, పెద్ద జట్లపై అతడి బౌలింగ్ పని చేయడంలేదని అమీర్ చురకలంటించారు. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ కాదన్నారు. గతంలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ స్లాగర్ అని సంబోధించారని, భారత జట్టు సెమీ ఫైనల్ చేరిందన్నాడు, దీంతో అమీర్ ను భారత నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Tags

Next Story