వరల్డ్ కప్ లో పాక్ నిర్ణయం సరైంది కాదు: ఐసిసి

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ లు ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయంపైన ఐసిసి అందోళన వ్యక్తం చేసింది. ఇది క్రీడా నియమాలకు విరుద్దమని తెలిపింది. ఐసిసితో పాకిస్థాన్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని ఐసిసి పేర్కొంది. టోర్నమెంట్ లో ఎంపిక చేసిన మ్యాచ్ ల్లో మాత్రమే ఆడుతామనడం, భారత్ తో ఆడబోమనడం మంచిది కాదని ఐసిసి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పాక్ నిర్ణయం షాక్ కలిగించిందని, ఈ మ్యాచ్ ఆ దేశపు క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఐసిసి హెచ్చరించింది. రెండు దేశాల మధ్య వివాదాలను క్రీడల్లోకి తీసుకరావడం మంచిది కాదని హితువు పలికింది. ప్రపంచ క్రికెట్ లోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ బలే క్రేజ్ ఉంటుంది. గత 14 సంవత్సరాల ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా సిరీస్ లు లేనప్పటికి ఐసిసి, ప్రధాన టోర్నమెంట్లలో తలపడుతున్నాయి. ఒకవేళ పాక్ మ్యాచ్ ను బహిష్కరిస్తే 2010 తరువాత రెండు దేశాల మధ్య జరగని మ్యాచ్ గా నిలిచిపోతుంది.
-
Home
-
Menu
