ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

X
మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డబ్బులు ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శికి బెల్లంపల్లిలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బాధితుడు రూ.5 వేలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్‌పి మధు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Next Story
-
Home
-
Menu
