ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి
X

నూతన గృహం నిర్మించుకుంటున్న వ్యక్తి నుంచి ఇంటి నంబర్ మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేసిన గ్రామ కార్యదర్శి శుక్రవారం ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు, లంచం తీసుకుంటున్న క్షణంలోనే గ్రామ కార్యదర్శిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పి జగదీశ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ...మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నూతన ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా తన ఇంటి నెంబర్ కొరకు కార్యదర్శిని సంప్రదించగా కార్యదర్శి బరపటి కృష్ణ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఎసిబిని ఆశ్రయించడం జరిగిందన్నారు. అట్టి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఫిర్యాదుదారున్ని మరొసారి కార్యదర్శి దగ్గరికి పంపించి ఇంటి నెంబరు కు అనుమతి ఇవ్వాలని కోరగా అట్టి కార్యదర్శి కరాకండిగా రూ.6 వేలు ఇస్తేనే ఇంటి నెంబరు ప్రాసెస్ చేస్తానని డిమాండ్ చేశాడని తెలిపారు. అట్టి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొన్న నల్లగొండ రేంజ్ యూనిట్ ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు.

ఏవో సూచన మేరకు అతని స్వాధీనం నుండి మొత్తం రూ.6000 రికవరీ చేసినట్టు తెలిపారు. పంచాయతీ ఎంపీఓ ను పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కార్యదర్శి ఇంటిపై కూడా మరొక టీం ఏమైనా అక్రమ ఆస్తులు ఉన్నాయా అని సోదాలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యదర్శి కృష్ణను అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లి లోని ఒకటవదనపు స్పెషల్ జడ్జి ఫర్ ఎస్ పి ఈ మరియు ఎసిబి కేసుల కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాల్సిన బాధ్యతలో ఉండి కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తీవ్రంగా తప్పుబట్టాల్సిన చర్యగా అధికారులు పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏసీబీ 1064 కు సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎసిబిని సంప్రదించడానికి ఎసిబి క్యూ ఆర్ కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుందనీ తెలిపారు. బాధితుడు, ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ ఘటన గ్రామస్థుల్లో కలకలం రేపగా, అవినీతిపై కఠిన చర్యలు తప్పవని ఎసిబి స్పష్టం చేసింది. ఈ దాడిలో ఎసిబి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story