పరకాలలో మద్యం తాగించి బీరు సీసాతో పొడిచి... హత్య

పరకాలలో మద్యం తాగించి బీరు సీసాతో పొడిచి... హత్య
X

పరకాల: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి అతడిని పొడిచి దారుణంగా చంపేసిన సంఘటన హన్మకొండ జిల్లా పరకాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... సిఎస్‌ఐ కాలనీలో మడికొండ సుమన్, లావణ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సుమన్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుండగా లావణ్య మున్సిపల్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో లావణ్యకు పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలంటే భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రియుడు గోవిందరావుపేటకు చెందిన వ్యక్తితో ఐదు లక్షల రూపాయలకు సుపారీ ఒప్పందం చేసుకున్నాడు.

రెండు సార్లు సుమన్ చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఏప్రిల్ మూడో తేదీన తన భార్యతో కలిసి భర్త బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు నుంచి భర్త కనిపించకుండా పోయాడు. భార్య ఏమీ తెలియనట్లుగా నటిస్తుండడంతో సుమన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గోవిందారావుపేట సమీపంలో సిగ్నల్ కట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. శివారులో గాలింపు చర్యలు చేపట్టగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. మద్యం తాగడానికి సుమన్‌ను గోవిందరావు పేట శివారులోకి తీసుకెళ్లారు. అనంతరం అతడికి పుల్‌గా మద్యం తాగించి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. మృతదేహం ఆనవాళ్లు లేకుండే చేసేందుకు దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెతో ప్రియుడు, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story