మహాపాపం చేశాను... బాధపడని రోజంటూ లేదు: పరకామణి కేసు నిందితుడు

తిరుపతి: పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ సంచలన వీడియో విడుదల చేశారు. 29 ఏప్రిల్ 2023లో పరకామణిలో తప్పు చేశానని, మహా పాపానికి ప్రాయశ్చితంగా తన ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించానని నిందితుడు రవికుమార్ తెలిపారు. తాను చేసింది మహా పాపం అని వెక్కి వెక్కి ఏడ్వడంతో పాటు బాధపడని రోజంటూ లేదన్నారు. తన కుటుంబం అనుకున్న విధంగానే తన ఆస్తిని స్వామివారి పేరిట రాశానని, ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, తన ఆస్తులు రాసుకున్నారని ప్రచారంలో వాస్తవం లేదని తెలియజేశారు. తనని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వారిపై కూడా కేసులు పెట్టానని వివరించారు. తనపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు చేశారని, ప్రైవేట్ పార్ట్ లో శస్త్ర చికిత్స చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానని, న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అందుకు తాను సహకరిస్తానని స్పష్టం చేశారు.
Tags
-
Home
-
Menu
